Tuesday, November 26, 2024

అక్రమ మద్యం పట్టివేత.. వాహనాల సీజ్.. ఇద్దరు అరెస్ట్

గంగవరం, జులై 15, (ప్రభ న్యూస్) : కర్ణాటక అక్రమ మద్యం తరలిస్తున్న వాహనాలతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు గంగవరం పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం నుండీ రెండు కార్లలో అక్రమమద్యంతో వస్తున్న వాహనాలను మండలంలోని కేటిల్ ఫారం వద్ద గంగవరం సి.ఐ.అశోక్ కుమార్,ఎస్.ఐ.ప్రతాప్ రెడ్డి సారధ్యంలో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొనే సందర్భంగా ఈ వాహనాలతో వస్తున్న మరో నిందితుడు ద్విచక్ర వాహనం వదిలేసి పారిపోయాడు.

ఈమేరకు శనివారం పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్టు చూపారు. ఇందులో నిందితులు ముగ్గురిలో బైరెడ్డిపల్లె మండలానికి చెందిన చరణ్ కుమార్, లోకేష్ లను అరెస్టు చేయగా.. పారిపోయిన హరీష్ కర్ణాటకలోని తాయలూరు వైన్ షాప్ ఓనర్ మధు, మైక్ విజ్ఞేష్ లపై మొత్తం ఐదుమందిపై కేసు నమోదు చేశామని, పట్టుబడిన మద్యం, వాహనాల విలువ రూ.5లక్షలు, పట్టుబడిన రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం రూ.7లక్షలు, మొత్తం వాటి విలువ 12లక్షల రూపాయలు ఉన్నట్లు ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement