Tuesday, November 26, 2024

తిరుమ‌ల‌లో నిఘా డొల్ల‌త‌నం – సోష‌ల్ మీడియాలో ఆనంద నిల‌యం వీడియోలు

తిరుమల ప్రభన్యూస్‌/అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమలలో భద్రతా వైఫల్యాలు ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వైరల్‌ అవుతున్న ఆనంద నిలయం దృశ్యాలు తిరుమలలోని నిఘా వైఫల్యా న్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వత్రా ఆందోళనకు, విమర్శలకు తావిచ్చిన ఈ ఘటన టీ-టీ-డీ విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పనితీరును ప్రశ్నిస్తోంది. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలంటూ మొన్న ఆందోళనకు గురి చేసిన ఫేక్‌ ఈ-మెయిల్‌ వ్యవహారం ఇంకా పోలీసులు తేల్చనే లేదు. మరోవైపు ఆన్‌లైన్‌ దర్శనం టిక్కెట్ల స్కాం విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఓ భక్తుని నిర్వాకం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిఘాను వెక్కిరించింది. ఆదివారం రాత్రి సెల్‌ఫోన్‌తో శ్రీవారి ఆలయం ఆవరణలోకి ప్రవేశించిన భక్తుడు ఆలయంలో ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు. సెల్‌ఫోన్‌లో పలు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి తీయడంతోపాటు శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను కూడా ఫొటోలు తీశాడు. స్వామి వారి దర్శనం అనంతరం వెళి ్ళపోయిన సదరు భక్తుడు ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు వద్ద భక్తుల తనిఖీల్లో నిఘా సిబ్బంది పని తీరు దీనికి అద్దం పడుతోంది. ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే మూడు అంచెల తనిఖీలు ఉంటాయి. ఈ తనిఖీలన్నీ దాటుకుని సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించడం, శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలను చిత్రీకరించడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టీటీడీ విజిలెన్స్‌ రంగంలోకి దిగి విచారణ షురూ చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పరిసరాలు, సీసీ కెమేరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు ఈ వీడియో చిత్రీకరించిందని గుర్తించినట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

గతంలో డ్రోన్‌ కలకలం..
గతంలో కూడా తిరుమలలో డ్రోన్‌ల కలకలం రేగింది. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అప్పుడు కూడా భక్తుల్లో ఇదే ఆందోళన నెలకొంది. భక్తులు, ఆగమ సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్‌, తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన వారు వీటిని అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్‌ కెమెరాలు నిషేధం ఉంది. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీ-టీ-డీ స్పష్టం చేస్తోంది.

హెలికాప్టర్‌ ల చక్కర్లు..
ఇటీవల కొద్దిరోజుల క్రితం తిరుమల గగనతలంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం భక్తులను మరింత అభద్రతా భావానికి గురి చేసింది. ఏప్రిల్‌ 25వ తేదీన శ్రీవారి ఆలయంపై మూడు హెలికాప్టnర్లు చక్కర్లు కొట్టాయి.హెలికాప్టnర్లు చక్కర్లు కొట్టడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్‌ ప్రాంతంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు- అధికారులు గుర్తించారు. తిరుమలలో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీ-టీ-డీ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు- ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయం నో ్లఫయింగ్‌ జోన్‌లో ఉంది.

చట్టపరంగా చర్యలు : టీ-టీ-డీ సీవీఎస్‌ఓ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన ఘటనపై ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీ-టీ-డీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ నరసింహ కిషోర్‌ తెలిపారు. టీ-టీ-డీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోనికి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరమని, ఈ విషయం భక్తులందరికీ తెలుసునన్నారు. ఈనెల 7వ తేదీ ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడిన నేపథ్యంలో దాదాపు రెండు గంటల పాటు- విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని, ఆ సమయంలోనే సదరు భక్తుడు పెన్‌ కెమెరా ద్వారా వీడియో చిత్రీకరించినట్టు- అనుమానిస్తున్నామన్నారు. అన్నీ తెలిసి ఒక భక్తుడు ఇలా చేయడం చాలా బాధాకరమని, సీసీటీ-వీల ద్వారా అతన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని టీ-టీ-డీ నిఘా, భద్రతాధికారి నరసింహ కిషోర్‌ తెలిపారు. టీ-టీ-డీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement