Saturday, November 23, 2024

సికింద్రాబాద్ – అగర్తలా మధ్య స్పెష‌ల్ ట్రైన్స్‌..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి త్రిపుర రాజధాని అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైలు నెంబర్ 0730 సికింద్రాబాద్-అగర్తలా మధ్య నడిచే రైలు ఈనెల 8, 15, 22 తేదీల్లో, సోమవారాల్లో సికింద్రాబాద్ లో సాయంత్రం గం.4-35కి బయలుదేరి గురువారం తెల్లవారు జామున 3 గంటలకు అగర్తలా చేర‌నుంది.

రైలు నెంబరు 07029 అగర్తలా-సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు అగర్తలాలో 12,19,26 తేదీ శుక్రవారాల్లో ఉదయం గం.6-10 కి బయలు దేరి ఆదివారం మధ్యాహ్నం గం. 2-50కి సికింద్రాబాద్ చేరుతుంద‌ని రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి బయలు దేరే రైలు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం, భువనేశ్వర్, గౌహతి, అంబాసా స్టేషన్ల మీదుగా ప్ర‌యాణించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement