Saturday, November 23, 2024

నాటుసారాపై సెబ్‌ ఉక్కుపాదం-16 రోజుల్లో 3,403 కేసులు, న‌లుగురిపై పీడీ యాక్ట్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆపరేషన్‌ పరివర్తన్‌ 2.0లో భాగంగా నాటుసారా తయారీదారులపై స్పషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్‌ఈబీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తరుచూ నాటుసారా తయారీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 10 నుంచి 26వ తేదీ వరకు నాటుసారా తయారీ, విక్రయాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు, ఏపీఎస్సీతో కలిపి విస్తృత దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 3,403 కేసులు నమోదు చేసి 2వేల 66 మందిని అరెస్టు చేశారు. 44వేల 58 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు, ఆయా కేసుల్లో 155 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి వినియోగించే 16లక్షల నాలుగు వేల, 741 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీలో కీలకమైన 73వేల 734 కిలోల నల్ల బెల్లం అధికారులు సీజ్‌ చేశారు.

17మందిపై పీడీ కేసులు..
రాష్ట్రంలో అక్టోబర్‌ 2020 నుంచి 17మందిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పలుమార్లు వీరికి కౌన్సిలింగ్‌ నిర్వహించినా నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పతుండటంతో వీరిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పీడీ కేసులు నమోదు చేసిన వారిలో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement