Friday, November 22, 2024

తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కుస్తీ…

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల్లో అధికారా న్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు పడుతున్నాయి. రోజుకొక కొత్త వ్యూహంతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్న ఆ పార్టీ పునర్‌వైభవం కోసం అహ ర్నిశలు శ్రమిస్తోంది. ప్రజల నుంచి కూడా పార్టీకి సానుకూల స్పందన వస్తున్న తరుణంలో టికెట్లు ఆశించే వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇంకా ఏడాది సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల సమరానికి సై అంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడంతో మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా రు. ఒకవైపు జిల్లాల పర్యటనతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న చంద్రబాబు మరోవైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే యువనేత నారా లోకేష్‌ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకా రం చుట్టారు.

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఒకవైపు అధినేత చంద్రబాబు, మరోవైపు యువనేత లోకేష్‌లు శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తం గా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లుగా భావిస్తున్న నేతలు టికెట్ల కోసం అధిష్టానం ముందు క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని ముఖ్య నేతల నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఆశావహులు టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టా నం దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతూ నియోజక వర్గాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాగా వేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటివరకు మౌనంగా, పార్టీకి దూరంగా ఉంటున్న కొందరు నేతలు మళ్లిd తమతమ నియోజకవర్గాల్లో బిజీ అవుతూ ఉన్నారు.

ఈ తరహా నేతలపై పార్టీ కేడర్‌లో కొంత అసంతృప్తి నెలకొంది. మరోవైపు అధిష్టానం కూడా వీరిపట్ల సానుకూ లంగా లేదు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టిలో పడ్డారు. నియోజకవర్గాల్లో తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా వీరికి కొంత అనుకూ లమైన సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో యువనేతలు కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. కేసులకు, దాడులకు బెదరకుండా అధికార పక్షానికి ధీటైన జవాబిస్తున్నారు. ఇటువంటి యువనేతలకు కూడా పార్టీ అధిష్టానం ప్రోత్సాహాన్ని ఇస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కొత్తగా సీట్లు ఆశించే వారి సంఖ్య గణనీ యంగా పెరుగుతూ వస్తుండటం అధిష్టానం కొంత ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఎన్నారైలకు కూడా కొన్ని నియోజక వర్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ ఎన్నికల్లో ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థు లను బరిలోకి దింపాలని యోచిస్తున్న తరుణంలో ఎన్నారై లతో పాటు మరికొందరు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీట్ల కోసం రంగంలోకి దిగారు.

ఈ పరిస్థితినంతా క్షుణ్ణంగా గమనిస్తున్న అధిష్టానం నియోజకవర్గాల్లో సొంత సర్వేలు నిర్వహించడంతో పాటు థర్డ్‌ పార్టీని రంగంలోకి దింపి గెలుపు గుర్రాలను అన్వేషి స్తోంది. ఇప్పటికే 158 నియోజక వర్గాల సమీక్షలను పూర్తి చేసిన చంద్రబాబు మరో 17 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో భేటీలను త్వరలోనే పూర్తి చేసి ఆ తర్వాత టికెట్ల ఖరారు, ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అయితే జన సేనతో పొత్తుల అంశం పూర్తిస్థాయిలో ఖరారయ్యాకే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు మూడు నుంచి ఆరు నెలల ముందుగానే ప్రకటించాలన్న యోచనలో తెదేపా అధిష్టానం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement