Friday, September 20, 2024

Seasonal Viral – నూజివీడు ట్రిపుల్ ఐటిలో క‌ల‌క‌లం … 800 మంది విద్యార్ధులు అస్వస్థత

అనారోగ్యంతో 800 మంది విద్యార్ధులు
నిన్న ఒక్క రోజే 342 మంది స్టూడెంట్స్ కు వాంతులు, విరోచ‌నాలు
క‌లుషిత నీరే కారణమంటున్న అధికారులు
అంద‌ర్ని ఆసుప‌త్రికి త‌ర‌లింపు ..
ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు..

నూజివీడు – ఎపిలోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు 800 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం గమనార్హం. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నారని నిర్వాహకులు చెప్పారు. విద్యార్ధులంద‌రినీ అసుప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.. క‌లుషిత నీటి వ‌ల్లే ఇబ్బందులంటున్న యాజమాన్యం.. దీనిపై విచారణ కమిటీ వేశామని చెప్పారు. కాగా, , సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement