ఏప్రిల్ 20వ తేది నుంచే సమ్మర్ హాలిడేస్
జూన్ 13నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం
ఈసారి వేసవి సెలవులు ఏకంగా 50 రోజులు
వార్షిక పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు
ఏపీ, తెలంగాణాలలోని పాఠశాలల్లో ఒంటి పూట బడులు కొనసాగుతన్నాయి. అలాగే ఎండలు విపరీతంగా ఉన్న సందర్భంగా ఈసారి వేసవి సెలవులు కూడా తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలలో పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలువులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. వీటితో పాటు.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అలాగే కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.
వేసవి సెలవులు కూడా.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి సెలవులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ సారి వేసవి సెలవులు ఎక్కవగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక జూన్ 13న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.