విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకార వేతనాలు విడుదల చేయాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కోరారు. ఆయన మాట్లాడుతూ… ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ-పాస్ నమోదు చేయించుకుని జీవో నెం.55 ప్రకారం స్కాలర్ షిప్ హామీపై ఉన్నత విద్యనభ్యసించేందుకు ఎంతోమంది ఏపీ విద్యార్థులు విదేశాలకు వెళ్లారని వివరించారు. అయితే, ఆ విద్యార్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకారవేతనాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయాలి : సీబీఐ మాజీ జేడీ
Advertisement
తాజా వార్తలు
Advertisement