రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కల్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను పవన్ కల్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం.
కాగా , మాధాపూర్ లోని నివాసం నుంచి రేపు ఉదయం 7 గంటలకు కారులో పవన్ కొండగట్టుకు బయలుదేరుతారు.. ఉదయం 11 గంటలకు కొండగట్టకు చేరుకుంటారు.. అక్కడ అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలు దేరుతారు..
ఇక పవన్ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ అధికారులు ఇప్పటికే కొండగట్టుకు చేరుకున్నారు.. పర్యటన ఏర్పాట్లు,భద్రతలపై వారు స్థానిక పోలీసులతో, ఇతర ఉన్నతాధికారులతో కలసి సమీక్షించారు..