అమరావతి,ఆంధ్రప్రభ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 24వ తేదీ బుధవారం నుండి జూన్ ఫస్ట్ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు ఇవ్వాల (గురువారం) పత్రికలకు విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారి తోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఉదయం తొమ్మిది గంటల నుండి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదే రోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 24వ తేదీన ఉదయం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, మధ్యాహ్నం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరుతాయి. 25వ తారీఖీన ఉదయం ఇంగ్లీష్ పేపర్ 1, మధ్యాహ్నం ఇంగ్లీష్ పేపర్ 2 జరుగుతాయి.
26వ తేదీన ఉదయం మాధ్స్ 1ఎ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 జరుగుతాయి. మద్యాహ్నం మ్యాథ్స్ 2ఎ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 జరుగుతాయి. 27న మ్యాథ్స్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మ్యాథ్స్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 29న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనమిక్స్ పేపర్ 1 జరుగుతాయి. అదేరోజు మధ్యాహ్నం ఫిజిక్స్ పేపర్ 2, ఎకనమిక్స్ పేపర్ 2 జరుగుతాయి. 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 జరుగుతాయి.
అదే రోజు మధ్యాహ్నం కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోసియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 జరుగుతాయి. 31వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 1 జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 జరుగుతాయి. జూన్ 1న ఉదయం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 జరుగుతాయి.
కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను కూడా ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. జనరల్ కోర్సులకు పరీక్ష ఫీజు 510 రూపాయలుగా నిర్ణయించారు. అదే ఓకేషనల్ కోర్సులకయితే 720 రూపాయలుగా నిర్ణయించారు. ఇంప్రూమెంట్ పరీక్ష రాసే అభ్యర్ధులకయితే అర్ట్స్ విద్యార్ధులకు అయితే రూ.1,230 సెన్స్ విధ్యార్ధులకైతే రూ. 1430గా ఫీజును నిర్ణయించారు.