అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం రాష్ట్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామల సింహాచలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. త్రినాధరావు వ్యవహరించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులుగా సామల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా మేకల శివార్జున, ఆడిట్ కన్వీనర్‌గా బోనెల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.జానకి రావు, పి.శేషగిరిరావు, వి.సురేంద్రనాధ్ బాబు, జి. రామయ్య, కట్టా గంగాధర్, కె. త్రినాధరావు, వి. నారాయణ రావు, పి.దేవానంద్, వి.యమున, బి.రామారావు, కె.మనోజ్ కుమార్, వి. సువర్ణ రాజు, వేమూరి విద్యా సాగర్, ఎచ్చెర్ల శ్రీనివాస రావు, జి.కె. విద్యాసాగర్, దూసి సుదర్శన రావు, జి. వెంకట నారాయణ, బి . విజయ్‌రాజ్, రాష్ట్ర ఆడిట్ కమిటీ- సభ్యులుగా ఎస్. కౌసల్య, పి. మునిరత్నం, ఎం.గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టే ముందు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని, అడహాక్ సర్వీస్ రూల్స్ రూపొందించి ఎంఈవో, డీవైఈవోతో పాటు అన్ని క్యాడర్స్ పదోన్నతులు కల్పించాలని, 223 జిఓ రద్దు చేసి, 302 జిఓ పునరుద్ధరించి జేఎల్ పదోన్నతులను అమలు చేయాలని తీర్మానించారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు ఆప్షన్ సౌకర్యం కల్పించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, డైట్ లెక్చరర్ పద్నోతులు అమలు చేయాలని, నూతన జూనియర్ కళాశాలలుగా హై స్కూల్స్‌లో ప్లస్ 2 ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.