మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగిని కులంపేరుతో దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటలో మంచినీటి చెరువు దగ్గర ఎన్టీఆర్ సుజల పథకం పున: ప్రారంభోత్సవంలో ఘర్షణ జరిగింది. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను కులంపేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా శ్రీనివాసరావు ఉన్నారు. 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Breaking: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ ఎస్టీ కేసు
Advertisement
తాజా వార్తలు
Advertisement