Saturday, November 23, 2024

Breaking: టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది.  సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఫిర్యాదు మేరకు పోలీసులు.. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే, విషయం తెలిసిన స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, వైసీపీ నేతలు అక్కడికెళ్లి టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడికొచ్చి తమ నాయకుడిని అవమానిస్తారా? అని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చింతమనేని స్పందిస్తూ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందన్నారు. అనంతరం సర్పంచ్ తొమ్మండ్రు భూపతి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చింతమనేని తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement