టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు… తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతోపాటు 307 కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. నిన్న రాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసుల ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలస్ స్టేషన్‌కు తరలించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణంతో నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసుల నిర్బంధించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. నందివాడ వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు.
కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలపై నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆయన అనుచరుల మీద రాళ్ల దాడి జరిగింది. ఇది వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేయి దాటుతుండగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. సుమారు 6 గంటలపాటు కారులోనే కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు దేవినేనిని అరెస్టు చేసి పెదపారుపూడికి తరలించారు. అక్కడి నుంచి నందివాడ స్టేషన్‌కు తరలించారు.