Saturday, January 4, 2025

Say No To Drugs – డ్ర‌గ్స్ వ‌ద్దే వ‌ద్దు – డార్లింగ్ ప్ర‌భాస్ సందేశం – వీడియోతో

హైద‌రాబాద్ – డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. డ్రగ్స్ వలన జరిగే అనర్థాలను వీడియోలో వివరించారు. ‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఆనందాలు.. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే, మనకోసం బతికేవాళ్లు మనకున్నారు. అలాంటప్పుడు జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ మనకు అవసరమా? డార్లింగ్స్.. ఇక నుంచి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నో చెప్పండి. ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు కాల్ చేసి చెప్పండి. డ్రగ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ప్రభాస్ త‌న వీడియో సందేశంలో పేర్కొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement