Thursday, November 21, 2024

పొదుపే ఇంధ‌నం.. ఏపీలో ఏటా రూ.వెయ్యి కోట్లు ఆదా..

వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏటా కనీసం రూ.వెయ్యి కోట్లు విలువైన ఇంధనాన్ని ఆదా చేసే అవకాశముందని, ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఇంధన పొదుపు ఉద్యమంలో స్వచ్చందంగా భాగస్వా ములైతే ఇది సాధ్యమని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2022-23లో విద్యుత్‌ డిమాండ్‌ 66,530 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేయగా, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా 17,085 మిలియన్‌ యూనిట్లు మేర ఆదా చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఇందులో దశల వారీగా ఏటా కనీసం 10 శాతం చొప్పున ఆదా చేసినప్పటికీ 1,700 మిలియన్‌ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చునని చెప్పారు. దీని విలువ సుమారు రూ. వెయ్యి కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మానవ జీవితాలను, ఆర్థిక వ్య వస్థలను ఇంధన వినియోగం ప్రభావితం చేస్తున్నదని, జీవన ప్రమాణాలతో ఇది ప్రత్యక్షంగా ముడిపడి ఉందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement