సత్తెనపల్లి లో కోడేల శివ ప్రసాద్ తనయుడు శివరామకృష్ణ కు తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది.. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమించింది.. ఈ మేరకు ఒక ప్రకటనను ఆ పార్టీ విడుదల చేసింది.. ఈ నియోజకవర్గం ఇన్ ఛార్జీ పదవి కోసం జివి ఆంజనేయులు, శివరామకృష్ణలు పోటీ పట్డారు.. అయితే అనూహ్యంలో ఇటీవలే బిజెపికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన కన్నాను అక్కడి పగ్గాలు ఇచ్చింది..
కాగా, రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మహానాడు విజయంతో వైసీపీ నేతల్లో దడ మొదలయిందని చెప్పారు. మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఏం చేస్తారో టీడీపీ ఫేజ్-1 మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పారని అన్నారు. సామాజిక న్యాయం చేసింది టీడీపీ మాత్రమేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు అమలు చేస్తారని… సంపదను సృష్టించి, ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల్లో చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని అన్నారు. నాలుగేళ్ల పాలనలో బూతులు తప్ప వైసీపీ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. బూతులు తిట్టే వారిని తాము కూడా తయారు చేస్తామని అన్నారు. సంపూర్ణ మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, ధరల స్థిరీకరణ నిధి, స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, ఢిల్లీని తలదన్నే రాజధాని, జాబ్ క్యాలెండర్ వంటి జగన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలన చేతకాకపోతే వదిలేసి పారిపోవాలని అన్నారు.