అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులు డిమాండ్ల పరిష్కారం కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కానీ కొంత మంది సర్పంచ్లు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. కార్లలో అసెంబ్లీ వద్దకు సర్పంచులు చేరుకున్నారు.
పోలీసుల వలయాన్ని చేధించుకుని ఊహించని విధంగా అసెంబ్లీ వద్దకు సర్పంచులు వచ్చేశారు. సర్పంచ్లు అసెంబ్లీ సమీపంలోకి వచ్చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. బారికేడ్లను తోసుకుని లోపలకెళ్లే ప్రయత్నం చేశారు సర్పంచులు. ఈ క్రమంలోనే పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.