Sunday, June 30, 2024

AP: తిరుమ‌ల‌లో శార‌దా పీఠం భ‌వ‌నం కూల్చాల్సిందే – శ్రీనివాసానంద సరస్వతి

తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. తిరుమలలోని విశాఖ శారదా పీఠం ఆక్రమణలను ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు పరిశీలించారు.

అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ… ”తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదు.. పూజలు చేయడం లేదు. 4 అంతస్తులకు అనుమతి ఇస్తే.. 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారు. 10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం” అని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement