Monday, January 13, 2025

AP | నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నారా, నందమూరి కుటుంబాలు

  • మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు..
  • బహుమతులు ప్రదానం చేసిన సీఎం దంపతులు..
  • పోటీల్లో పాల్గొన్న ప్రతీ మహిళలకు రూ.10,116 నగదు..

నారావారి ప‌ల్లె – ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌గ్రామంలో సంక్రాంతి వేడుక‌లు అంబ‌రంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ వేడుక‌ల‌లో చంద్ర‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రీలు పాల్గొన్నారు.. వారితో పాటు నంద‌మూరి కుటుంబాలు కూడా పాల్గొన్నాయి ముందుగా గ్రామంలో బోగి మంట‌లు వేశారు.

ఈ సంద‌ర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు.., విద్యార్థులకు బెలూన్ బ్లాస్టింగ్, మ్యూజికల్ చైర్స్ బెలూన్ బ్లాస్టింగ్,గన్ని బ్యాగ్ రేస్ లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్, పొటాటో గ్యాదరింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల‌లో ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ సంద‌డి చేశాడు.. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు..

ప్ర‌తి ఒక్క మ‌హిళ‌కు రూ.10 వేలు .. భువ‌నేశ్వ‌రి

- Advertisement -

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో పాల్గొన్న అందరూ గెలుపొందినట్టే.. విన్నర్లను డిసైడ్‌ చేయడం మాకు చాలా కష్టం అయ్యిందన్నారు.. అందరికీ బహుమతులు అందిస్తాం.. ఈ పండుగ మీతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు..


మరోవైపు.. భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు… ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ అని కాదు.. ఈ పోటీల్లో 120 మంది పాల్గొన్నారు.. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఎంతో కష్టపడి ముగ్గులు పెట్టారు.. దీంతో ఈ పోటీల్లో పాల్గొన్నవారందరికీ ప్రతీ మహిళలకు సాయం చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాన‌ని చెప్పారు. ఈ పోటీల‌లో పాల్గొన్న ప్ర‌తి మ‌హిళ ఇళ్లకు రూ.10,116 పంపిస్తానని ప్రకటించారు.. డబ్బులతో వెల కట్టాలని కాదు.. వాళ్లను చూసి నాకు చాలా సంతోషం కలిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. అందరూ సంతోషంగా బతకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు నారా భువనేశ్వరి..

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు..
మరోవైపు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు .. 15 ఈ ఆటోలు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు.. గ్రామంలో సబ్ స్టేషన్, ఏ.రంగంపేటలోని హైస్కూల్’లో కోటి రూపాయలతో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి పునాదులు వేశారు.. సీఎం ఇంటి ఎదుట స్వర్గీయ నందమూరి రామారావు, బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి, పలమనేరు, నగరి శాసనసభ్యులు పులివర్తి నాని, అమర్నాథరెడ్డి, గాలి భాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement