Friday, October 18, 2024

Indrakiladri | అందరికీ నచ్చేలా, భక్తులు మెచ్చేలా… శానిటేషన్ అపూర్వం !

ఆంధ్రప్రభ స్మార్ట్‌, ఎన్టీఆర్ బ్యూరో : మనసు నిండా భక్తి భావాన్ని నింపుకొని, కనకదుర్గమ్మ నామస్మరణ జపిస్తూ లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణ రక్షణలు పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో బేష్ అనిపించేలా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేసింది.

మూడు షిఫ్టుల్లో నిరంతరాయం ప‌నులు

అందరికీ నచ్చేలా… భక్తులు మరింత మెచ్చేలా అత్యంత క్లిష్టమైన పారిశుద్ధ్య నిర్వహణను మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేసిన పారిశుధ్య శ్రామికులు రోజుకి 90 టన్నులు 12 రోజుల్లో 990 టన్నుల చెత్తను సేకరించారు. ఇంద్రకీలాద్రి పైన కింద గుర్తించిన 31 ప్రదేశాలలో పారిశుధ్య నిర్వహణలో వేల మంది కార్మికులు భాగస్వాములు కాగా, చెత్త తరలింపుకు 50 వాహనాలు వినియోగించారు.

ఆధ్యాత్మిక నగరం విజయవాడలో.. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే వేల సంఖ్యలోని భక్తులకు ఆహ్లాదకర సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారు, మరి ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల మనోభావాలకు అనుగుణంగా స్వేచ్ఛ వాతావరణం కల్పిస్తున్నారు.

అత్యంత క్లిష్టంగా ఉండే పారిశుద్ధ్య నిర్వహణను మున్సిపల్ కార్మికులు సమర్థవంతంగా నిర్వహించి అందరితోనూ భేష్ అనిపించుకున్నారు. మున్సిపల్ అధికారుల ప్రణాళికతో భక్తులకు తాగునీరు అందించడంతోపాటు, ఎక్కడ చెత్తాచెదారం ఉండకుండా మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పరిశుభ్ర వాతావరణన్ని అందించారు.

మున్సిపల్ భాగస్వామ్యమే ముఖ్యం..

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పటిష్ట ఏర్పాటు చేసింది. వీఎంసీ లోని కార్మికులతో పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్కర్లను తీసుకుని క్యూలైన్లతోపాటు, ఇంద్రకీలాద్రి కొండపైన, దిగువన కనకదుర్గ నగర్, గాట్ల వద్ద పరిశుద్ధ వాతావరణం కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

శానిటేషన్ మైంటైన్ చేయడంలో మూడు షిఫ్టులలో సిబ్బందిని నియమించి, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగ్గా చేశారు. యాత్రికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు దేవస్థానం అనుబంధ ఆలయాలు, అన్నప్రసాద కౌంటర్లు, లడ్డు వితరణ కౌంటర్లు, ప్రధాన రహదారులతో పాటు అనుబంధ రహదారుల్లో కూడా పారిశుద్ధ్యన్ని క్షణక్షణం మెరుగుపరుస్తూ వచ్చారు.

వేల సంఖ్యలో కార్మికులు…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా సంపూర్ణ పారిశుద్వాన్ని అన్ని ప్రాంతాలలో కల్పించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల మూడో తేదీ నుండి 12 వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం 1400 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను తీసుకున్నారు. వీఎంసీ లోని 400 మంది శానిటేషన్ సిబ్బంది కూడా మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించారు.

ముఖ్యంగా క్యూలైన్లతో పాటు ఘాట్లు వద్ద, అమ్మవారి ఆలయ పరిసరాల్లో, ప్రధాన రహదారుల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిశుభ్ర వాతావరణన్ని కల్పించారు. రోజుకి 90 టన్నుల చెత్త సేకరించడంతోపాటు, మొత్తం 12 రోజుల్లో 989.65 టన్నుల చెత్తను సేకరించి గుంటూరులోని జిందాల్ ఎనర్జీ ప్లాంట్ కు వీటిని తరలించారు.

ఇందుకోసం మూడు షిఫ్టుల్లో ఒక్కో షిఫ్టులో 50 చెత్త తరలింపు వాహనాలను, మొత్తం 150 వాహనాలను వినియోగించారు. గుర్తించిన అతి ముఖ్యమైన 31 ప్రాంతాలలో చీఫ్ మెడికల్ ఆఫీసర్, ముగ్గురు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్, బయాలజిస్ట్, 6 శానిటరీ సూపర్ వైజర్లు, 64 మంది శానిటరీ ఇన్ పెక్టర్లు, 74 మంది శానిటరీ మేస్త్రీలు మూడు షిఫ్టుల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింద స్థాయి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement