Friday, November 22, 2024

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరాలయం


కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం సంగ‌మేశ్వ‌రాల‌యం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. అయితే ఇప్పుడు జలాధివాసం నుంచి సంగమేశ్వరాలయం బయటపడుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం నాటికి 858.90 అడుగులకు చేరుకుంది. దీంతో సంగమేశ్వరాలయ పై భాగం గోపురాలు కనిపిస్తున్నాయి. మరో 20 అడుగుల మేరకు కృష్ణానదిలో నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 29 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement