Tuesday, November 26, 2024

ఆంక్షల అమ్మ ఒడి, షరతులపై షరతులు.. 1.50 లక్షల మంది తల్లులకు ఖాతాలు లేవు

కర్నూలు : పేద పిల్లలకు విద్యను చేరువ చేయడానికే ప్రభుత్వం నిర్దేశించిన పథకమే అమ్మఒడి నవ రత్నాలలో ఒకటైన ఈ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పథకంను అందుకోవాలంటే విద్యార్థుల తల్లితండ్రులు అనేక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి.గతంలో పిల్లలను బడికి పంపిస్తే చాలు ఒక్కో విద్యార్థికి 15వేలు చోప్పున వారి తల్లి అకౌంట్లలో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కో విద్యార్థికి కాదు, ఇంటికి ఒక పిల్లవాడికే అంటూ ఈ పథకం అమలుకు మొదటిసారి మడత పేచీ పెట్టారు. కాలానుగుణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టు-కొని మరిన్ని ఆంక్షను తెర మీదకు తెచ్చారు.కరోనా కష్ట కాలంలో బతుకు జీవుడా అంటూ ప్రజలు పోరాటం చేసిన వైనంలో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం 75 శాతం వుండాల్సిందే అంటూ కొత్త నిబంధనకు రూపకల్పన చేశారు. 75 శాతం హాజరు నమోదైన పిల్లల తల్లులకు మాత్రమే అమ్మఒడి అంటూ ప్రభుత్వ పధకాల ఒడి నుండి లబ్ధిదారులను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ వచ్చింది ప్రభుత్వం.

ఇలాఒక ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో నిబంధనతో అమ్మఒడికి ఆంక్షలు విధిస్తూ వస్తుంది. అమ్మఒడి పొందాలంటే కరెంట్‌ బిల్లులో యూనిట్ల వాడకంతో లింక్‌ పెట్టి కొన్ని బడులకు ఈ మొత్తాన్ని కట్‌ చేశారు జగన్‌ ప్రభుత్వం.ప్రతి ఏడాది జనవరిలో అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్‌ ఈఏడాది మాత్రం జూన్‌ నుంచి ఇస్తామని చెప్పడంతో ఒక ఏడాది అమ్మఒడిని జగన్‌ లబ్ధిదారులకు దూరంచేశారని సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటు-ంది ప్రభుత్వం. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోత విధించి ఆ మొత్తాన్ని రూ.14వేలకు కుదించింది వైసీపీ ప్రభుత్వం., ఆ తర్వాత కొత్త జిల్లాల ప్రకారంగా అమ్మ ఒడి ప్రయోజనం పొందాలంటే ఆధార్‌ని అనుసంధానం చేస్తూ అందుకు తగ్గ మార్పులను సరిచేసుకోవాలంటూ మరో ఆంక్షలను తెర మీదికి తెచ్చింది ప్రభుత్వం.వైసీపీ ప్రభుత్వం తలకు మించిన ఆర్ధిక భారాలతో ప్రభుత్వాన్ని నడపలేక ఆంక్షల పేరుతో, నిబంధనల సాకుతో,పరిమితులు పెట్టు-కుంటూ పధకాల లబ్దిదారులను తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ ప్రతిపక్షాలు వాపోతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 3.60 లక్షల మందే అర్హులు..

కర్నూలు, నంద్యాల జిల్లాలో అమ్మ ఒడి కింద దాదాపు 5.40 లక్షల మంది విద్యార్థులు ఉంటే, గత ఏడాది లక్షన్నర మందికి కోత విధించారు. 3.60 లక్షల మందికి విద్యార్థులకు మాత్రమే అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు. అయితే అనర్హులుగా గుర్తించిన ఒకటిన్నర లక్ష తల్లుల్లో.. చాలా వరకు బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఒకవేళ ఉన్నా ఆధార్‌ లింకు లేకపోవడం, విద్యార్థుల అ-టె-ండెన్స్‌ తక్కువగా ఉండడం, ఇలా ఎన్నో కారణాలు చూపి తొలగించడం జరిగింది. ఈ క్రమంలో వీటిని పునరుద్ధరించాలని. తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో.. తిరిగి వాటిని సరిచేసుకోవాలని సూచించారు జరిగింది. అన్ని సరి ఉన్నాయి.. ఇక అమ్మఒడి రావడమే ఆలస్యం అంటూ ఎదురు చూస్తున్నా… అమ్మలకు.. ప్రభుత్వ తాజా నిబంధనలతో ఈ మారు సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కొత్త నిబంధన మేరకు అర్హులను గుర్తించి.. జిల్లాల వారీగా జాబితా సిద్ధం చేశారు… జాబితాలో ఉన్న వారికి జూన్‌ 20లోగా అమ్మ ఒడి పడనుందని భావిస్తున్న తరుణంలో.. పిడుగు పడ్డట్టు-గా మరో షాక్‌ తప్పలేదు.

అమ్మ ఒడిలో మరో 1000 కోత?

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15 వేలలో మరో వెయ్యి కోత పెట్టనుంది.తాజా కోతతో మొత్తంగా రూ.2 వేలకు తగ్గనున్నాయి. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో అమ్మఒడిలో రూ.వెయ్యి తగ్గించారు. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమ్మ ఒడి పథకం కింద జూన్‌లో రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యాశాఖ ద్వారా బడుల నిర్వహణకు ఉపయోగించనున్నట్లు- తెలుస్తోంది. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం ఉంటే అమ్మఒడి నగదు జమ చేస్తారు. అమ్మఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజా ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో జూన్‌లో నగదు జమ చేయనున్నారు.

మరుగుదోడ్ల నిర్వహణ పేరుతో కోబడికి వెళ్లే చిన్నారులు ఉన్న కుటు-ంబంలో ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది కుటు-ంబంలో ఒక్కరికే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. ఈ మొత్తంలో స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి రూ.14 వేలు అకౌంట్లలో జమ చేస్తున్నారు. తాజాగా రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు తగ్గించారు. ఈ రెండు వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అయితే ప్రభుత్వం అమ్మఒడి నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తుంది. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టు-కున్న లబ్ధిదారులైన అమ్మలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లకే కుదించిఅయితే తాజా కోతలతో అమ్మఒడి పథకం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు- అమలు చెయ్యాల్సిఉంది. అయితే ప్రభుత్వం దీనిని నాలుగేళ్లకే కుదించింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండేళ్లపాటు- జనవరి నెలలో అమ్మఒడిని ఇచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది ఆరు నెలలు ముందుకు జరిపి జూన్‌కు ఈ పథకాన్ని వాయిదా వేసింది. 2022 జూన్‌లో ఇస్తే మళ్లీ 2023 జూన్‌లో ఇవ్వాల్సి ఉంటు-ంది. 2024 మే నెలలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చెయ్యాల్సిన అవసరం ఉందని సర్కారు ప్లాన్‌ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాకాకుండా జనవరిలోనే అమ్మఒడి ఇస్తే, 2023, 2024లోను జనవరిలోనే నగదు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement