వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని శేషగిరిరావు పిటిషన్లలో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యాయత్నం చేశారని.. తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు కూడా ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
- Advertisement -