Saturday, November 23, 2024

సెల్యూట్‌ ఎస్పీ సార్‌.. చెరువుల వద్దకు వెళ్లి పరిరక్షణ..

అనంతపురం, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు చేయాల్సిన పనిని ఎస్పీ ఫక్కిరప్ప చేస్తుండడంతో స్థానిక ప్రజలు ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నారు. కదిరి డివిజన్‌లోని 10 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 30 సంవత్సరాల్లో ఇటువంటి వర్షాలు కురవలేదు. కదిరిలో ఏకంగా 63 మిల్లి మీటర్ల వర్షం కురవడంతో పై భాగంలో ఉన్న చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి.

దీంతో నానా దర్గా ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. మదనపల్లి, కదిరి రహదారి పై నీళ్లు ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల న్ని జలమయమయ్యాయి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప విఠలరాయుని చెరువు వద్దకెళ్లి నీటి ప్రవాహ ఉదృతిని పరిశీలించారు. మరోసారి వర్షాలు పడితే వరద ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ఇరిగేషన్‌అ ధికారుల సహకారంతో ప్రజలకు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

జిల్లాలో చాలా చెరువులు, కుంటలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఆ ప్రాంతాలకు చిన్న పిల్లలను, ఈత రాని వారిని తీసుకెళ్లొందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓపికగా కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులు, వాగులు, వంకలు పరిశీలించి భవిష్యత్తులో వరద వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించారు. జిల్లా ఎస్పీ చూపించిన చొరవను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement