Friday, November 22, 2024

Salary Hike – గ్రామ వాలంటీర్ల‌కు జ‌గ‌న్ బ‌ర్త్ డే గిఫ్ట్ – జ‌న‌వ‌రి నుంచి జీతాలు పెంపు …

తిరుపతి – ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డుల్లో పనిచేసే వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కానుక అందించింది. వాలంటీర్స్‌కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రకటన చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామని మంత్రి కారుమూరి తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని రూ. 5 వేల నుంచి రూ. 5,750 పెంచుతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లు సమర్ధవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో నెలకు రూ.5వేలు కాకుండా అదనంగా నెలకు రూ.750 పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి తెలిపారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement