Saturday, November 23, 2024

Breaking: ఉద్యోగులందరికీ జీతాలు.. తేల్చి చెప్పిన మంత్రుల కమిటీ

ఉద్యోగులందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. పీఆర్సీపై ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల కమిటీ ఎదుట మూడు ప్రతిపాదనలను స్టీరింగ్ కమిటీ ఉంచింది. చర్చించి మళ్లీ చెబుతామని మంత్రుల కమిటీ పేర్కొంది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదనలు చేసింది. చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరారు. సమస్యల పరిష్కారం తర్వాతే తమ కార్యాచరణపై చర్చిస్తామని స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జీతాల విషయంలో తొందర ఎందుకని స్టీరింగ్ కమిటీ ప్రశ్నించింది. సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ పేర్కొంది. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదికపై అంత పట్టుదల ఎందుకు? అని ప్రశ్నించారు. పీఆర్సీ నివేదిక ఇస్తే సమస్య పరిష్కారం అయినట్లా? అని అడిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement