Tuesday, November 26, 2024

మోడల్‌ స్కూల్స్‌ టీచర్లకు జీతాలు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ టీచర్లకు అక్టోబర్‌ నెల జీతం చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోషియేషన్‌ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కోమటిరెడ్డి శివశంకర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేసారు.

ఈనెలలో 8 రోజులు గడిచినా జీతాలు రాకపోవడం దురదృష్టకరమని, .010 పద్దు క్రింద కాకుండా గ్రాంటిన్‌ ఎయిడ్‌ క్రింద జీతాలు చెల్లింపే జీతాల ఆలస్యానికి ప్రధానకారణమని వారు తెలియచేసారు. కావున మోడల్‌ స్కూల్స్‌ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా ముఖ్యమంత్రి చొరవతీసుకోవాలని వారు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement