అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి అటువంటిప్పుడు డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం జగన్ లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటి? అని ప్రశ్నించారు. కేవలం ఒక్క ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని అడిగారు. నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని ఆయన తెలిపారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement