Tuesday, November 26, 2024

బద్వేల్ ఉపఎన్నికలో పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత?: సజ్జల

ఏపీలో జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఏపీలోని రోడ్ల దుస్థితిపై శనివారం పవన్ కల్యాణ్ శ్రమదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్పష్టమైన విధానమే లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాలని హితవు పలికారు. కెమెరా అన్ చేసి యాక్షన్ అనగానే  చెయ్యడానికి ఇది సినిమా కాదన్నారు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని విమర్శించారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాం కంటే చాలా మెరుగ్గా రోడ్ల నిర్మాణం ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. చీప్‌ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం మానుకోవాలని పవన్ కల్యాణ్ కు సజ్జల సూచించారు.

బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదన్నారు. అసలు ఎన్నకల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత అని ప్రశ్నించారు. ఎవరో ఒకరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో వాళ్లు ఉన్నారని.. వైఎస్‌ జగన్ సమర్ధత వల్ల మేం ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నామని చెప్పారు. జనసేన, టీడీపీ కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నారేమో అని సజ్జల పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: హరితహారం కోసం హరిత నిధి.. గ్రీన‌రీలో తెలంగాణ మూడో స్థానం: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement