Thursday, November 21, 2024

అమ‌రావ‌తే రాజ‌ధాని అని కేంద్రం చెప్ప‌లేదు – స‌జ్జ‌ల‌

అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతే రాజధాని అని కేంద్రం చెప్పలేదని, రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సల హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతినే రాజధానిగా మేం గుర్తిస్తున్నాం అని కేంద్రం అనకపోయినా అన్న ట్లు చంద్రబాబు, పచ్చ మీడియా వక్రీకరిస్తున్నాయని ధ్వజమెత్తారు. భూముల విలువ పెంచుకుని తానూ, తన కోటరీ ప్రయోజనం పొందాలనుకున్న చంద్రబా బు, రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక బ్రోకర్‌లా పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. అందుకే ఏ చిన్న పాటి ఆశ కన్పించినా అమరావతి రాజధాని అంటూ మళ్లీ తెర మీదకు వస్తున్నాడని సజ్జల ఆరోపించారు. రాజధానికి ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి 30 వేల ఎకరా లు ప్రభుత్వ భూమే కావాలని చెబితే దాన్ని జగన్‌ 30 వేల ఎకరాలకు ఒప్పుకున్నారని అని కట్‌ చేసిన వీడియోను చంద్రబాబు చూపడం సిగ్గుచేటన్నారు.


కేంద్రానిది స్పష్టమైన వైఖరి
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం ఎప్పుడో చెప్పిందన్నారు. హైకోర్టులో కూడా కేంద్రం ఈ కేసు లో 13204/2020 కింద అఫిడవిట్‌ వేసిందన్నారు. ఇప్పుడు సుప్రీంలో నడుస్తున్న కేసులో కేంద్రం ఏదైతే అఫడవిట్‌ వేసిందో అదే అప్పట్లో ఏపీ హైకోర్టులోనూ వేసిందని చెప్పారు. సీఆర్‌డీఏ యాక్టును రాష్ట్ర ప్రభు త్వం చేసేటప్పుడు కేంద్రాన్ని సంప్రదించలేదని ఆ అఫడవిట్‌లో కేంద్రం పేర్కొందన్నారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నదే కానీ కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్రం తాను వేసిన అఫడవిట్‌ లోని పాయింట్‌ 7లో పేర్కొందన్నారు. విభజన చట్టం లో ఏముందో దాని ప్రకారమే తాము చెప్పామని కేంద్రం పేర్కొందన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ- వేశా మని, చట్ట ప్రకారం ఆర్ధిక సహకారం కింద రూ.2500 కోట్లు- అందించామనీ చెప్పారన్నారు. చెప్పారు. వాళ్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశామని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. 2020లో ఇప్పటి ప్రభు త్వం ఆ చట్టాన్ని రిపీల్‌ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిం దన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెడుతూ చట్టం చేశామన్నారు. అప్పుడు వాళ్లు అమరావతి అన్నప్పుడు, మేం మూడు రాజధా నులు అన్నప్పుడు కూడా కేంద్రాన్ని సంప్రదించలేదనే కేంద్రం చెప్పిందన్నారు. వాళ్లకు సంబంధం లేదు కాబట్టే సంప్రదించలేదన్నారు. అదే అంశం కేంద్రం వేసిన అఫడవిట్‌లో కూడా స్పష్టంగా ఉందని సజ్జల చెప్పారు. నిపుణుల కమిటీ వద్దని సూచించినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చంద్రబాబు హడావుడిగా రాజధాని ప్రకటన చేశాడని ఆరోపించారు.


వికేంద్రీకరణ తథ్యం
రాజధాని వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని సజ్జల తెలిపారు. 3 రాజధానుల ఏర్పాటు తథ్యం అన్నారు. కోర్టును ఒప్పించి ప్రజల మన్ననలు పొందుతామన్నారు. ఎవర్నీభ్రమల్లో పెట్టే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా వికేంద్రీకరణ చేసి తీరతామన్నారు. ఏడాదిలో ఎన్నిక లు ఉన్నామని చెప్పారు. ఏడాది దాక ఆగలేక..జనం తమ వెంట వస్తారో లేదో తెలియక టీడీపీ వాళ్ళు ముందస్తు అంటూ ప్రచారం మొదలుపెట్టారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement