Friday, November 22, 2024

Counter – జ‌గ‌న్ ఏం అన్యాయం చేశారు…ష‌ర్మిల‌ను ప్ర‌శ్నించిన స‌జ్జ‌ల

తాడేప‌ల్లి: తనకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డిమాండు చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షర్మిల మాట్లాడిన ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టార‌న్నారు. రావటమే మాపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆమెకి ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేద‌ని అంటూ . వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే అని కౌంట‌ర్ ఇచ్చారు.

వైయ‌స్ జగన్ కి చెల్లెలుగా, వైయ‌స్ఆర్‌కి కూతురిగా మాత్రమే షర్మిల‌ ప్రజలకు తెలుసని, అంత‌కి మించి ష‌ర్మిల‌కు ఎటువంటి గుర్తింపు ఎపిలో లేద‌ని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ వైయ‌స్ఆర్‌ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు అని గుర్తు చేశారు. పదవులు ఇవ్వకపోవటమే అన్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌టీపీలో షర్మిలతో పాటు చాలా మంది తిరిగార‌ని , మరి వాళ్ళను అన్యాయం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. ఓదార్పు యాత్ర వద్దు అనటంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనను, ఙ్ఞాపకాన్ని సమాధి కట్టాలి అనుకున్నారని ఆరోపించారు. వైఎస్ ను సజీవంగా ఉంచాలన్న జగన్ పట్టుదల, తపన నుంచే ఓదార్పు యాత్ర వచ్చిందని తెలిపారు. ఓదార్పు యాత్ర చేపట్టినందుకు కాంగ్రెస్ ఏ స్థాయిలో వేధింపులకు గురి చేసిందో ప్రజలకు తెలుసని సజ్జల పేర్కొన్నారు.
జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ చేయని అక్రమం లేదని ఆరోపించారు. అయినా నేలకు కొట్టిన బంతి పైకి ఎగిసినట్లు జగన్ ఉవ్వెత్తున ఎదిగారని తెలిపారు. షర్మిల స్క్రిప్ట్ చంద్రబాబు నుంచి వచ్చినట్లు ఉందని ఆరోపించారు. స్క్రిప్ట్ లో ఏం ఉందో తెలియకుండా ముక్కున బట్టీ పట్టి మాట్లాడుతున్నట్లు ఉందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు అనటం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా ఇంత అడ్డగోలు అబద్దాలు చెప్పర‌ తెలిపారు.

రాజశేఖరరెడ్డి బిడ్డ, జగన్ సోదరి అనే ఏకైక అర్హతతో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని చేసిందని సజ్జల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎందుకు ప్రచారం చేయలేదు? అని ప్రశ్నించారు. ఆమె మాకు వద్దు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్నప్పుడు షర్మిల ఎందుకు స్పందించ లేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు నోరు విప్పలేదని తెలిపారు. ఆమె ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారో తమకు అర్థం కావటం లేదని సజ్జల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండి మాట్లాడుతున్నారా… తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. గందరగోళం ఉండవద్దనే ఆమె అసంబద్దత, డొల్ల వ్యాఖ్యల పై స్పందిస్తున్నామని సజ్జల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement