మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవికుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ నెల 29 లేదా 31వ తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement