భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు
కింద ఉన్న విద్యుత్ వైర్లను తాకిన వంతెన
సకాలంలో పవర్ సరఫరా నిలిపివేత
తృటిలో తప్పిన పెను ప్రమాదం ..
రైళ్ల సర్వీస్ లకు స్వల్ప అంతరాయం
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం పాదచారుల వంతెన కుంగింది. 3, 4 ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్ నంబర్ 3 వైపునకు దీని మీదుగానే వెళ్తుంటారు. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి.
విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది..అదే సమయంలో ప్లాట్‌ఫాంపైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ పవర్ నిలిచిపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఫుట్ బ్రిడ్జిని మూసివేశారు..యుద్ద ప్రాతిపదికన మరమత్తులు చేపట్టారు..