Sunday, November 10, 2024

Rushikonda – ఆ ఆరు వంద‌ల కోట్ల‌తో ఒక జిల్లాను అబివృద్ధి చేయ‌వ‌చ్చు – ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

జ‌గ‌న్ దుబారా ఖ‌ర్చుల‌పై ప‌వ‌న్ కల్యాణ్ రుస‌రుస‌
అభివృద్ది అనేది వైసిపి పాల‌న‌లో లేదు
అందిన‌కాడికి దోచుకోవ‌డం .. దాచుకోవ‌డ‌మే
తాను మాటలు చెప్ప‌న‌ని,చేసి చూపుతాన‌న్న ఉప ముఖ్య‌మంత్రి
గొల్ల‌ప్రోలులో పించ‌న్లు పంపిణి
ప్ర‌భుత్వం నుంచి ఒక్క పైసా కూడా జీతం తీసుకోను

పిఠాపురం – మాజీ సీఎం జగన్ రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టారని.. అది గత వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ . అదే రూ.600 కోట్లతో ఒక జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరిగేది అని తెలిపారు. ప్రతీ శాఖలో పారదర్శకత, జవాబుదారీ తనం తీసుకొస్తా అన్నారు. తప్పు చేస్తే తననయినా ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులు పించన్ లు అందజేశారు..

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా అని అన్నారు. మంత్రిగా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నా అని.. ఎక్కువ మాటలు చెప్పను.. ఎక్కువ పని చేస్తా అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు తీసేస్తామని భయపెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పంపిణీతో పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నాన‌ని అన్నారు.

త‌న‌కు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ముఖ్యమని అంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ నిధులు దారి మళ్లించిందన్నారు. ఓటు వేయకపోయినా ఏ పార్టీ వారైనా ప్రశ్నించవచ్చన్నారు. హంగులకు, ఆర్భాటాలకు తాను వెళ్లనని పవన్ అన్నారు. అవినీతి చేయనని ప్రజలకు మాట ఇస్తున్నా అన్నారు.

డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించనని తెలిపారు. పిఠాపురంలో 620 గ్రామ సచివాలయాలు ఉన్నాయని.. ప్రతి సెక్రటేరియట్‌లో 10 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. గతంలో 4 రోజులు ఇచ్చే పెన్షన్ ఒక రోజులో ఇస్తున్నామన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ ఎక్కడ ఆగిందన్నారు.

జీతం తీసుకోను…

ముందుగా తాను ఎమ్మెల్యేగా వ‌చ్చే జీతం తీసుకోవాల‌ని భావించాన‌ని, అయితే ప్ర‌భుత్వంలో అప్పులు చూసిన తర్వాత జీతం తీసుకోకూడ‌ద‌ని నిర్ణయించుకున్నాన‌న్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ . అలాగే త‌న‌కు కేటాయించిన క్వార్డ‌ర్ మ‌ర‌మ్మ‌త్తులు, ఫ‌ర్నిచ‌ర్ లు ప్ర‌భుత్వం సొమ్ముతో కాకుండా త‌న స్వంత సొమ్ముతో స‌మ‌కూర్చుకుంటాన‌ని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement