ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి: రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుఆదివారం సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనం సొమ్ముతో జగన్తన విలాస భవనం నిర్మించుకున్నారని వాఖ్యానించారు. రుషికొండ భవనాలపై ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఈరోజు తొలగిందన్నారు.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వస్తే అడ్డుకున్నారని, కేసులు పెట్టారని మండిపడ్డారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన చేస్తారని అప్పటి వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు పెట్టిందని, చివరికి ఘోరంగా ఓడిపోయిందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ, మాట్లాడుతూ..” అసెంబ్లీలోఅమరావతి రాజధానికి జగన్ మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని, . పచ్చటి రుషికొండకు బోడిగుండు కొట్టారని ఎద్దెవ చేశారు.
రహస్యంగా ఎందుకీ నిర్మాణాలు..
దేశంలో ఇంత వివాదాస్పద భవనాలు ఎక్కడా కట్టలేదని, అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని, . లాభాల్లోని టూరిజం భవనాలను కూల్చి రాజ భవనాలు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేవని ప్రజావేదిక భవనాన్ని మాజీ సీఎం జగన్ ప్రభుత్వం కూల్చివేసిందని మరి రుషికొండకు ఏం అనుమతులు ఉన్నాయని కట్టారని ప్రశ్నించారు .
న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం అందించారని . సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారనిఆగ్రహం వ్యక్తం చేశారు. . 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని, . వీటిని ఏం చేయాలోముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి నిర్ణయం తీసుకుంటామన్నారు. . విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పినా.. ప్రజలు నమ్మలేదు. అందుకే విశాఖలో కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇచ్చి రాజధాని వద్దని తీర్పు ఇచ్చారని గంటా శ్రీనివాసరావు అన్నారు.