Saturday, December 28, 2024

AP | స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలకు పరుగో పరుగు…

  • జ‌న‌వ‌రి నుంచి చార్జీలు పెంచే అవ‌కాశం
  • దీంతో రిజిస్ట్రేష‌న్ కోసం కొనుగోలుదారుల ప‌రుగులు
  • ఏపీలో నేడు ఒక్క రోజే రెట్టింపు రిజిస్ట్రేష‌న్లు


అమ‌రావ‌తి – ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి పెర‌గ‌నున్న‌ట్లు వార్త‌లు వస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి. ఇప్పటికే చార్జీల పెంపుదలపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వం ముందుంచారు. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ, విధివిధానాలపై కసరత్తులకు మరికొంత సమయం పట్టేట్టు ఉండడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.

అయితే ఈ కొత్త చార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఖాయమైన నేపథ్యంలో, ఇవాళ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్ర‌జ‌లు పోటెత్తారు. చార్జీలు పెంచేంత వరకు ఆగకుండా… ఆస్తుల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement