Wednesday, November 13, 2024

Rules Revised – ఇకపై ఇంటి నిర్మాణాలకు అనుమ‌తులు మ‌రింత సులువు – మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, అక్టోబర్ 20: ఇక‌పై ఇంటి నిర్మాణాల అనుమ‌తులు మ‌రింత సులువు చేస్తూ సంబంధిత స‌వ‌ర‌ణ‌ల‌ను ఆమోదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. స్థానిక స‌న్ రైజ్ క‌ల్యాణ మండ‌పంలో రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రోడ్డు త‌క్కువ వెడ‌ల్పు ఉన్నా భ‌వ‌న నిర్మాణ య‌జ‌మానుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని బిల్డింగు నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇచ్చేందుకు సంబంధిత ప్ర‌ణాళిక‌ల్లో సంబంధిత నియ‌మ నిబంధ‌న‌లలో మార్పులు చేశామన్నారు . ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి నియ‌మం ప్ర‌కారం రోడ్డు వెడ‌ల్పు 30 అడుగులు ఉండాలన్నారు . అంత‌క‌న్నా త‌క్కువ ఉన్న చోట ప‌ర్మిష‌న్ ఉండాలంటే అప్పుడు బిల్డింగ్ కు అనుమ‌తులు రావని తెలిపారు. ఇరుకుగా ఉన్న రోడ్లు ఏమ‌యితే ఉన్నాయో … వాటిని అలానే వ‌దిలేసి వీలున్నంత మేర‌కు స్థానిక అవ‌స‌రాల దృష్ట్యా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు . ఒక‌వేళ రోడ్డు వెడ‌ల్పు 30 అడుగులు ఉన్నా, లేక‌పోయినా ప‌ది అడుగులు క‌న్నా త‌క్కువ ఉన్నచోటు కూడా త‌ద‌నుగుణంగా అక్క‌డున్న భ‌వ‌న య‌జ‌మానుల ర‌హ‌దారికి వీలున్నంత మేర స్థ‌లం ఇచ్చి ఇళ్ల నిర్మాణాల‌ను సాగించేందుకు త‌ద‌నుగుణ నిబంధ‌న‌ల్లో మార్పులు చేశామని వివరించారు ప‌ట్ట‌ణ వ్యాప్తంగా ప‌లు వీధుల్లో ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే రోడ్ల వెడ‌ల్పుపై నిర్ణ‌యం తీసుకున్నామన్నారు.

ముఖ్యంగా సంతోషి మాత కోవెల మొద‌లుకుని చాక‌లి వీధి వ‌ర‌కూ ఇరుకిర‌కుగా ఉన్న రోడ్లు విస్త‌ర‌ణ‌కు వీలుకానీ రోడ్ల‌ను వీలున్నంత మేర అభివృద్ధి చేసి భ‌వ‌న నిర్మాణ దారుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని భావించామని, త‌ద్వారా త‌క్కువ స్థ‌లంలో కూడా ఇదివ‌ర‌క‌టి విధంగా ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదు అన్న మాటే ఉండ‌దని తెలిపారు.ఆ విధంగా న‌గ‌ర వ్యాప్తంగా ఉన్న వీధుల‌ను గుర్తించామని, వాటిలో ఇళ్ల నిర్మాణం ఇక సులువు కానుందన్నారు ఇదివ‌ర‌కులా కాకుండా ఇప్పుడు బ్యాంకులు రుణాలు వ‌స్తున్నాయి క‌నుక ఆ ప్రాంతంలో ఇళ్లు క‌ట్ట‌డానికి అవ‌కాశం ఉన్నా రోడ్డు నిర్మాణానికి కొంత స్థ‌లం వ‌దిలేయాల్సి ఉంటుందన్నారు. దాంతో ఇంటి నిర్మాణం ఆగిపోతున్న‌దని,అందుకే ప్లాన్ అప్రూవ‌ల్స్ ఇచ్చే క్ర‌మంలో కొన్ని మార్పులు తెచ్చామని తెలిపారు . అలానే బ్యాంకు రుణాలు కూడా ఎప్రూవ‌ల్ లేక పోతే రావ‌డం లేదని, దీంతో నిర్మాణాలు ఆగిపోతున్నాయని తెలిపారు.
కొంతమంది అవ‌గాహ‌న లేక రూల్స్ ను అతిక్ర‌మించి నిర్మాణాలు చేస్తున్నారని,దాంతో ధ‌నం, శ్రమ వృథా అవుతున్నాయన్నారు . అధికారులు గుర్తించాక వాటిని తొల‌గిస్తున్నారని,లోక‌ల్ బా డీస్ కు అవ‌స‌రం అయిన నిధులు స‌మకూరాలంటే కొత్త నిర్మాణాలు జ‌ర‌గాలని, అలానే కొత్త నిర్మాణాలు సాగాలంటే నిబంధ‌న‌లు స‌వ‌రించాలన్నారు . అవి ఇల్లీగ‌ల్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ కాకుండా ఉండాలని,ఇలాంటి ప్రాంతాల‌ను న‌గ‌ర వ్యాప్తంగా 23 ప్రాంతాల‌ను గుర్తించామని,వాటిలో ఇళ్ల నిర్మాణాలు సాగించాలంటే గ‌తం మాదిరిగా కాకుండా అక్క‌డున్న రోడ్డు వెడ‌ల్పు కు అనుగుణంగా బిల్డింగు నిర్మాణ దారులు స్థ‌లం వ‌దిలే విధంగా ఇప్ప‌టి నిబంధ‌న‌లు మార్చి వేశామని తెలిపారు . ఈ స‌వ‌ర‌ణ ఆధారంగా కొత్త నిర్మాణాలు సాగే అవ‌కాశం ఉంటుందని మంత్రి ప్రసాదరావు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement