తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి శోభకు మరి 10 రోజులు మిగిలి ఉన్నాయి. పండుగ సందర్భంగా పల్లెలకు వెళ్లేందుకు పట్నం వాసులు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద పండగ కావడంతో ప్రజలు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనుంది. ఇందులో సంక్రాంతికి ముందుగా 4,145 బస్సులు, పండుగ అనంతరం 2,825 బస్సులు తిరగనున్నాయి. జనవరి 8 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. స్పెషల్ బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు 1500 బస్సుల్ని APSRTC నడపనుంది.
మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అదిలాబాద్, ఖమ్మం , భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు..కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కలగనుంది. అయితే TSRTC మాత్రం ఏ విధమైన అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital