అనంతపురం – తాను మరికొద్ది క్షణాలలో అపస్మారకంలోకి వెళుతున్నానని గ్రహించిన ఓ ఆర్టీసీ డ్రైవర్ చివరి క్షణంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి 54 మంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు ..ఈ సంఘటన అనంతపురం జిల్లా ళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది.. వివరాలలోకి వెళితే . శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు కర్నూల్ నుంచి రాయదుర్గం వెళుతుండగా కళ్యాణదుర్గంలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బస్సు డ్రైవింగ్ చేస్తూనే స్పృ తప్పి పడిపోయాడు. అయితే తాను స్పృహతప్పే సమయంలోనూ డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ మీద పడిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నారు.
వెంటనే ప్రయాణిలు, బస్ కండెక్టర్ కలిసి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహాయంతో అస్వస్థతకు గురైన డ్రైవర్ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు. తీవ్రమైన అలసట కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకుని డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే అస్వస్థతకు గురైన సమయంలో డ్రైవర్ ఎంతో సమయస్ఫూర్తితో బస్సును నిలిపియేయడం వల్లే ఎలాంటి ప్రమాదం జరుగలేదని ప్రయాణికులు చెబుతున్నారు.