మిడుతూర్, ప్రభ న్యూస్ : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ సమీపంలోని వాగు వద్ద ఆర్టీసీ డ్రైవర్ ముత్తు జవలి, కండక్టర్ శేషన్నపై గుర్తు తెలియని ఆకతాయిలు దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ ముత్తు జావలి పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి అక్కడున్న బైక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వల్ప గాయాలపాలైన డ్రైవర్ ముత్తు జావలిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.