Monday, November 25, 2024

ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్‌! మూడు నెలల ముందే రూ.122 కోట్ల రాబడి

అమరావతి,ఆంధ్రప్రభ: ఆర్టీసీ కార్గో ఆదాయం అదిరింది. ఆర్థిక సంవ త్సరం ముగింపునకు మూడు నెలల ముందుగానే గతేడాది సాధించిన మేర ఆదాయం సాధ్యమైంది. ఇప్పుడు రాష్ట్రంలో సరుకు రవాణాలో ఆర్టీసీ అగ్రగామిగా నిలిచింది. 2017లో పూర్తిస్థాయి కార్గో, సరుకు రవాణా సేవలు ప్రారంభించిన ఆర్టీసీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ మెప్పించడం ద్వారా అగ్రస్థాయికి చేరుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. నమ్మకమైన సేవలు అందిస్తూ తక్కవ సమయంలోనే సరుకు, పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చడంతో వినియోగదారులు సైతం ఆర్టీసీ కార్గో పట్ల మక్కువ చూపుతున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్గో ద్వారా ఆర్టీసీకి రూ.122 కోట్ల ఆదాయం సమకూరగా..ఈ ఏడాది డిసెంబర్‌ 25 నాటికే గత ఏడాది ఆదాయాన్ని అధిగమించింది. మరో మూడు నెలల్లో కార్గో ద్వారా ఆర్టీసీకి రూ.160 కోట్ల వస్తుందనే ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement