జగనన్న తోడు పథకం ద్వారా మూడేళ్లలో రూ.927కోట్ల సాయం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న తోడు మూడవ విడత నిధులను విడుదల చేశారు. ఈసందర్భంగా బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… సొంత షాపు ఉన్న వారికి ఏసీ సర్కార్ సాయం అందజేస్తోందన్నారు. దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. 3.30లక్షల మందికి రూ.330కోట్లు ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. ఎక్కడ కూడా లంచాలు లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నామన్నారు. లక్షా 97వేల కోట్ల రూపాయలు అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేశామన్నారు. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, ప్రతి గడపకూ సాయం చేస్తున్నామన్నారు. దేశంలో ఏపీ 11.43 శాతం జీడీపీ గ్రోత్ రేటుతో ప్రథమ స్థానంలో ఉందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement