అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్‌వాచ్‌మెన్‌లు జీతభత్యాలకు, పాఠశాలల్లో పరిశుభ్రత కోసం రూ 87,90,43000 నిధులు విడుదల చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆయా, నైట్‌వాచ్‌మెన్‌ల జీతభత్యాలను చెల్లించడంతో పాటు పాఠశాలల పరిశుభ్రత కోసం టీఎమ్‌ఎఫ్ (టాయిలెట్ మెయిన్‌టెనెన్స్ ఫండ్)ను విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి కేంద్ర విద్య శాఖ ఆదేశాలతో పాఠశాలల్లో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా పారిశుధ్యం, పరిశుభ్రతపై వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. 15 రోజుల పాటు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతు పారిశుధ్య నిర్వహణ నిమిత్తం అధికారులు నిధులు మంజూరు చూయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.