Friday, November 22, 2024

రూ.85 లక్షల వంట నూనె స్వాధీనం.. నిల్వ ఉంచిన దుకాణాలపై దాడులు

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.85 లక్షల విలువైన వంటనూనెను అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినా, ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్‌ఛార్జి డీఎస్‌ఓ రాజరఘువీర్‌ వ్యాపారులను హెచ్చరించారు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి దాదాపు రూ.85 లక్షలు విలువైన వంటనూనెను సీజ్‌చేసినట్లు తెలిపారు.

కర్నూలు నగరంలోని అంబికా ఆయిల్‌ మిల్లులో దాదాపు రూ.50లక్షల విలువ చేసే 65 టన్నుల నూనెను సీజ్‌ చేయగా, జిల్లాలోని ఆదోని, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతివ్యాపారి వంటనూనెలను నిబంధనలను మేరకు విక్రయించాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారం వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement