మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ.31 లక్షల నగదు, అత్యంత విలువైన అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ప్రకటించింది. సూర్య నారాయణ రెడ్డి, భరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై పిఎంఎల్‌ఎలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇడి తెలిపింది. కర్నాటకలోని బళ్లారిలో నమోదైన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఫిబ్రవరి 10న సోదాలు నిర్వహించినట్లు ఒక ప్రకటనలో ఈడి తెలిపింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాదాపు రూ.42 కోట్ల నగదును సమీకించిన భరత్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగించినట్లు తమకు కీలక ఆధారాలు లభించాయని ఇడి తెలిపింది. తాము జరిపిన సోదాలలో అత్యంత కీలకమైన పత్రాలు, వ్యాపార రికార్డులు, స్థిర చరాస్తులకు చెందిన వివరాలు లభించాయని తెలిపింది. వీటితోపాటు రూ. 31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వివరించింది.