తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేలు పించన్ ఇస్తామని ప్రకటించారు టిడిపి అధినేత చంద్రబాబు. .. జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.. ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ పూలే అని అన్నారు.
ఆ మహాశయుడి ఆశయాల్లో భాగంగానే టిడిపి పా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని చెప్పారు. ఫులే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చినట్లు చెప్పారు.
బిసిలకు వరాలు జల్లు
తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు… రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని, వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తామని చెప్పారు… చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతానన్నారు. . పెళ్లి కానుక రూ.లక్షకు పెంచుతామని వాగ్ధానం చేశారు.. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని, . బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.