తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మధు అనే బెంగాల్ టైగర్ కు 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బెంగుళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్కును నుంచి 2018లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలకు తీసుకొచ్చారు.
అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా ఈ పులి జంతు ప్రదర్శన విభాగం ఆధ్వర్యంలోనే ఉంది. అయితే, వృద్దాప్యం కారణంగా రెండు నెలలుగా సరిపడా ఆహారం, నీరు సరిగా తీసుకోకపోవడంతో ఈ పులి సోమవారం మృతి చెందింది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల పాథాలజీ విభాగం వైద్యుల బృందం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాయల్ బెంగాల్ టైగర్ మధు.. వృద్ధాప్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతిన్నాయిని.. అందువల్లే చనిపోయిందని వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు.