క్రిమినల్స్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను శాసిస్తున్నారని, అట్లాంటి వారిని ఏరిపారేయాలన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇవ్వాల (ఆదివారం) రాత్రి వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడలోని సర్పవరం జంక్షన వద్ద ప్రసంగించారు పవన్. కోన్కిస్కాగాళ్లను తను కేర్ చేయనని, అధికారం ఉందన్న అహంకారంతో లోకల్ ఎమ్మెల్యే ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకతను తన కారు డ్రైవర్ని మర్డర్ చేసి, బాధిత కుటుంబానికి పార్సల్ చేశాడని, మరో ఎమ్మెల్యే భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు డెకాయిట్ గా మారరని ఆరోపించారు. రౌడీయిజం, దోపిడీ వంటి క్రిమినల్స్‌కి తాను ఎదురుతిరుగుతానన్నారు. తనకు జనవాణిలో ఎమ్మెల్యే ద్వారంపూడిపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. తాను ఆంధ్రాలోనే ఉంటా.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. తనను తిడితే కోపం రాదని తన కార్యకర్తలను ఒక్క మాట అన్నా తట్టుకోలేనన్నారు పవన్.. కాకినాడ ఎమ్మెల్యేకు మహా తిమ్మిరి ఉందని, అహంకారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.