తిరుమల: తిరుమలలో ఇవ్వాల (శనివారం) శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. అనంతరం మీడియాతో పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. పదో తరగతి ఉత్తీర్ణతపై తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది అన్నారు. కొవిడ్ కారణంగానో… పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వల్లనో ఉత్తీర్ణతా శాతం తగ్గి ఉంటుందని, దీనికి రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
అంతేకాకుండా మహనాడులో తోడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ లీడర్ లోకేష్.. జూమ్ మీటింగ్ కి కోడాలి నాని, వంశి వస్తే ఎందుకు పారిపోయాడని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం ఉంది… అందుకే మాట్లాడితే పార్టీని మూసివేస్తాను అంటున్నాడని హేళన చేశారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పి తీరాలన్నారు మంత్రి రోజా.